Avatar 2 : అవతార్ లో అవసరాల శ్రీనివాస్

Tuesday,December 13,2022 - 03:47 by Z_CLU

Srinivas Avasarala Penned Dialogues For James Cameron’s Avatar-The Way of Water

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్’ (Avatar 2). ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ గా ‘అవతార్-2: ది వే ఆఫ్‌ వాటర్’ రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్‌ కామెరూన్‌ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు.

‘అవతార్ 2’ ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్‌ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘అవతార్ 2’ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక ఆసక్తికరమైన అప్‌ డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశాడు. ‘అవతార్- ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్‌ కి డైలాగ్స్ రాశాడు శ్రీనివాస్  అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ విలక్షణంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది.

అందుకే అవతార్-2 కోసం ఆయన్ను తీసుకున్నారు. అవతార్ 2 తెలుగు వెర్షన్ కు అవసరాల డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ విజువల్ వండర్ మరో 4 రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics