శ్రీకాంత్ ‘రా...రా’ మూవీ ఆడియో రిలీజయింది

Thursday,November 09,2017 - 11:02 by Z_CLU

శ్రీకాంత్ హీరోగా నటించిన ‘రా…రా’ మూవీ ఆడియో రిలీజయింది. అనంతపురంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మనుషులకు, దయ్యాలకు మధ్య జరిగే హారర్ ఎలిమెంట్స్ తో పాటు అవుట్అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.

శ్రీకాంత్ సరసన నాజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రావ్ రాక్ షకీల్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, ఆలీ తో పాటు గిరిబాబు ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.