కొంచెం కొత్తగా ట్రై చేశా...

Friday,July 07,2017 - 08:00 by Z_CLU

శ్రీకాంత్ హీరోగా ఓ డిఫరెంట్ ఫిలిం తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ హీరో గా,నాజియా హీరోయిన్ గా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘రారా’. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని త్వరలోనే విడుదల రిలీజ్ కానుంది.


ఈ సినిమాకి సంబంధించిన ఓ సాంగ్ ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాప్ షకీల్, నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా సంగీత దర్శకునితో పాటు గాయని శ్రావణ భార్గవి పాడారు. ఎంటర్టైన్ మెంట్ తో కూడిన హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో మరో సారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను విభిన్న రీతిలో జరిపి ఇదే నెలలో సినిమాను రిలీజ్ చేస్తారని తెలిపారు మేకర్స్.