శ్రీకాంత్ 'ఆపరేషన్ 2019' ఫస్ట్ లుక్

Friday,January 26,2018 - 03:09 by Z_CLU

ఓ వైపు స్టార్ హీరో సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తూనే మరో వైపు హీరోగా డిఫెరెంట్ సినిమాలు  చేస్తూ ఎప్పటి కప్పుడు సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కరణం బాబ్జీ డైరెక్షన్ లో ‘ఆపరేషన్ 2019’ సినిమాతో సెట్స్ పై ఉన్నాడు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

ఫుల్లీ లోడెడ్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని సమ్మర్ రిలీజ్ కి టార్గెట్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్. ‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అలివేలు నిర్మిస్తున్నారు. షకీల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.