బాలయ్య కొత్త సినిమాలో విలన్ గా సీనియర్ హీరో

Friday,June 30,2017 - 12:27 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా సెట్స్ పై ఉన్న బాలయ్య మరోవైపు KS రవి కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆగష్టు సెకండ్ వీక్ నుండి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, ఫుల్ ఫ్లెజ్డ్ గా ఈ సినిమా విలన్ క్యారెక్టర్ పై ఫోకస్ పెట్టింది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ కోసం అటు బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా మందిని కన్సిడర్ చేసిన సినిమా యూనిట్, చివరికి సీనియర్ హీరో శ్రీకాంత్ ని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

చాలా ఏళ్లుగా క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్, తాజాగా విలన్ గా మారిన విషయం తెలిసిందే. నాగచైతన్య కొత్త సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అటు ఓ కన్నడ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా విలన్ గా కనిపించబోతున్నాడట శ్రీకాంత్. ఈ సినిమాకు జయసింహ లేదా రెడ్డిగారు అనే టైటిల్ పెట్టే యోచనలో టీం ఉంది.