అసురన్ రీమేక్ డైరక్టర్ ఫిక్స్?

Tuesday,November 19,2019 - 02:02 by Z_CLU

మొన్నటివరకు ఈ రీమేక్ డైరక్టర్ ఎవరనే అంశంపై చాలా డిస్కషన్ నడిచింది. హను రాఘవపూడి, క్రిష్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ ఫైనల్ గా అసురన్ రీమేక్ ను డైరక్ట్ చేసే అవకాశం శ్రీకాంత్ అడ్డాలకు దక్కినట్టు టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే శ్రీకాంత్ అడ్డాల, వెంకీ కలిసి అసురన్ రీమేక్ తో సెట్స్ పైకి వెళ్తారు.

బ్రహ్మోత్సవం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు శ్రీకాంత్ అడ్డాల. మధ్యలో 2-3 ప్రాజెక్టులు చర్చకు వచ్చినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒక దశలో అల్లు శిరీష్ హీరోగా అడ్డాల దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. ఫైనల్ గా అసురన్ రీమేక్ తో మరోసారి సెట్స్ పైకి రాబోతున్నాడు అడ్డాల.

తమిళ్ లో కల్ట్ క్లాసిక్ గా పేరుతెచ్చుకుంది అసురన్. అందుకే తెలుగులో మంచి డైరక్టర్ ను సెలక్ట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఓ 15 మంది దర్శకులకు ప్రత్యేకంగా సినిమాను కూడా చూపించారు నిర్మాత సురేష్ బాబు. వాళ్లలోంచి శ్రీకాంత్ అడ్డాలను సెలక్ట్ చేయబోతున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.