జులై 7న శ్రీదేవి "మామ్" రిలీజ్

Sunday,May 21,2017 - 05:53 by Z_CLU

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం ‘మామ్‌’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల తెలుగు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్స్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మామ్ కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ‘మామ్‌’ కోసం హీరోని శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ సెలెక్ట్‌ చేయడం. 2007లో విడుదలైన ‘ఎ మైటీ హార్ట్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో ఏంజెలినా జోలీ సరసన నటించిన అద్నన్‌ సిద్ధిఖి అయితే శ్రీదేవికి కరెక్ట్‌ జోడీ అని గుర్తించిన కూతురు జాన్వి కపూర్‌ ఈ విషయాన్ని తండ్రి, ప్రొడ్యూసర్‌ అయిన బోనీకపూర్‌ దృష్టికి తీసుకెళ్ళడం, అతను ఓకే అనడం, అద్నన్‌ని టెస్ట్‌కి పిలిపించడం జరిగిపోయింది.

ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది మామ్. ఇంగ్లిష్-వింగ్లిష్ లాంటి సూపర్ హిట్ తర్వాత శ్రీదేవి చేస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే.