Sridevi Soda Centre - Sudheer Babu లైటింగ్ అదిరింది

Tuesday,May 11,2021 - 01:31 by Z_CLU

సుధీర్ బాబుతో ‘పలాస 1978’ చిత్ర దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. నేడు సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా హీరోని విష్ చేస్తూ గ్లిమ్స్ వదిలారు. 37 సెకన్ల నిడివితో విడుదల చేసిన వీడియోలో సుదీర్ బాబు లుక్ , యాక్షన్ సీన్స్, విజువల్స్ తో పాటు మణిశర్మ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. టీజర్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చూపిస్తూ పడవ పైకి ఎక్కే షాట్ కూడా బాగుంది.

ఊర్లో ఏ ఫంక్షన్ అయినా తన లైటింగ్ తో ఆ వేడుకకి మరింత కళ తీసుకొచ్చే లైట్ మెన్ సూరిబాబు పాత్రలో నటిస్తున్నాడు సుదీర్. గ్లిమ్స్ లో క్యారెక్టర్ కి సంబంధించి సూరిబాబు జాతరలో తన లైటింగ్ చూస్తూ మురిసిపోయే షాట్ కూడా వేశారు. అలాగే సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలియజేస్తూ కొన్ని యాక్షన్ సీన్స్ చూపించారు. ఫైనల్ గా షార్ట్ టైంతో కట్ చేసిన ఈ గ్లిమ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ ఇంప్రెస్ చేసేలా ఉంది.

Sridevi Soda Centre movie Sudheer Babu

ఇక సుధీర్ బాబు కి సంబంధించి బర్త్ డే గ్లిమ్స్ కాబట్టి సినిమాలో ఇతర పాత్రల తాలూకు సన్నివేశాలు కానీ హీరోయిన్ ని కానీ చూపించలేదు. విలేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. 70MM ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై విజయ్, శశి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా రామకృష్ణ -మౌనిక ఆర్ట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics