Sridevi Soda Center - రేపే ట్రయిలర్ రిలీజ్

Wednesday,August 18,2021 - 07:01 by Z_CLU

సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదే ఊపులో సినిమా ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రయిలర్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ ను కూడా యూనిట్ డిఫరెంట్ గా ప్లాన్ చేసింది.

హీరో సుధీర్ బాబు, కమెడియన్ సత్యం రాజేష్ కలిసి శ్రీదేవి సోడా సెంటర్ పోస్టర్ పట్టుకొని వస్తారు. దాన్ని గోడపై అతికిస్తుంటారు. అందులో ప్రత్యేకత ఏంటంటే.. పోస్టర్ పై సుధీర్ బాబుతో పాటు, మహేష్ బాబు కనిపిస్తాడు. అలా మహేష్ చేతులు మీదుగా ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్న విషయాన్ని వెరైటీగా, ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేశారు.

ఈ మధ్యే ఈ సినిమా నుంచి విడుదలైన నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్‌కు కూడా చాలా మంది స్పందన వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. దాన్ని దినకర్, రమ్య బెహ్రా అంతే అద్భుతంగా ఆలపించారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్ట్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది శ్రీదేవి సోడా సెంటర్. తమ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు మేకర్స్. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ పీక్ స్టేజ్ లో నడుస్తోంది. ట్రయిలర్ రిలీజైన తర్వాత సినిమాకు మరింత బజ్ రానుంది. అంచనాలు కూడా పెరగనున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics