Sridevi Soda Center - ట్రయిలర్ రివ్యూ

Thursday,August 19,2021 - 11:50 by Z_CLU

సుధీర్ బాబు హీరోగా నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ ట్రయిలర్ వచ్చేసింది. మహేష్ బాబు గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం..

సినిమా జానర్ ఏంటి..? కథ ఏంటి..? హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ ఏంటి..? లాంటి విషయాల్ని ట్రయిలర్ లో చెప్పారు. మరీ ముఖ్యంగా సినిమాపై లేనిపోని అంచనాల్ని పెంచకుండా కథ ఎలా ఉండబోతోందనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు.

సూరిబాబుగా సుధీర్ బాబు అదరగొట్టాడు. ఎప్పట్లానే ఫిజిక్ తో మెస్మరైజ్ చేసిన ఈ హీరో, సూరిబాబుగా పెర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా చూపించాడు. గోదావరి జిల్లా పట్టణాల్లో కుర్రాళ్లు ఎలా ఉంటారో అచ్చంగా అలానే కనిపించాడు సుధీర్ బాబు. అంతేకాదు.. ఈ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో చూపించారు. అప్పటివరకు సరదాగా, పక్కింటి కుర్రాడిలా కనిపించిన సూరిబాబు.. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఎలా ఎగ్రెసివ్ గా మారాడనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు.

ఇక హీరోయిన్ అనంది లుక్స్, నటన కూడా బాగుంది. చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ఏరికోరి ఆనందిని ఎందుకు తీసుకున్నారో ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఇక ట్రయిలర్ కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తన సీరియారిటీ మొత్తం చూపించారు మణి. అలాగే శ్యామ్ దత్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.

ఈనెల 27న థియేటర్లలోకి వస్తున్నాడు సూరిబాబు. భారీ అంచనాలతో వస్తున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను 70mm ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics