శ్రీదేవి ‘Mom’ ట్రేలర్ రిలీజ్ డేట్

Thursday,June 01,2017 - 07:26 by Z_CLU

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉదయ్ వార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘Mom’ ట్రేలర్ జూన్ 3 న రిలీజ్ కి రెడీ అయింది. జూలై 7 న రిలీజ్ కానున్న ఈ సినిమా బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో టీనేజర్ కి తల్లిగా నటిస్తుంది శ్రీదేవి. అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్దీఖీ కీ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో పాకిస్తానీ నటి సాజల్ అలీ శ్రీదేవి కూతురి క్యారెక్టర్ లో కనిపించనుంది.

ఇప్పటి వరకు డిఫెరెంట్ డిఫెరెంట్ ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, స్టోరీ ఏ మాత్రం రివీల్  కాకుండానే  సినిమాపై క్యూరాసిటీ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. దానికి తోడు ఎల్లుండి రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రేలర్, సినిమాపై ఆల్ రెడీ క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని మరింత రేజ్ చేసే చాన్సెస్ బోలెడు కనిపిస్తున్నాయి.