ట్రెండింగ్ అవుతున్న శ్రీదేవి ‘Mom’ టీజర్

Monday,April 03,2017 - 06:05 by Z_CLU

అతిలోక సుందరి తన సెకండ్ ఇన్నింగ్స్ లోను అంతే ప్లాన్డ్ గా సినిమాలను ఎంచుకుంటుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి డిఫెరెంట్ విమెన్ సెంట్రిక్ ఎంటర్ టైనర్ తరవాత గ్యాప్ తీసుకుని మరీ చేసిన ‘Mom’ ఇప్పుడు జస్ట్ శ్రీదేవి ఫ్యాన్స్ లోనే కాదు డిఫెరెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడే వారందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.

జీ స్టూడియోస్, బోణీ కపూర్ సంయుక్తంగా నిరిస్తున్న ‘Mom’ సినిమాలో నవాజుద్దీన్ సిద్దీఖీ తో పాటు, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రవి ఉదయ్ వార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజైన తరవాత, ఈ సినిమా రీసెంట్ టైం లో రిలీజైన రెగ్యులర్ థ్రిల్లర్స్ కి నెక్స్ట్ లెవెల్ అనే కాంప్లిమెంట్స్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న సినిమా యూనిట్ ఈ సినిమాని 14 జూలై న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. A.R. రెహ్మాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.