సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మామ్

Wednesday,June 21,2017 - 07:05 by Z_CLU

జూలై 7 న రిలీజ్ కి రెడీ అవుతున్న ‘మామ్’ అటు బాలీవుడ్ నుండి బిగిన్ అయితే సౌత్ ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన అతిలోకసుందరి శ్రీదేవికి ఇది 300 వ సినిమా కావడంతో జస్ట్ శ్రీదేవి ఫ్యాన్సే కాదు సినిమా యూనిట్ కూడా అంతే ఎగ్జైటెడ్ గా ఉంది.

ఇప్పటికే స్పెషల్ టీజర్ తో పాటు A.R. రెహ్మాన్ కంపోజ్ చేసి స్వయంగా పాడిన ‘ఓ సోనా’ అనే సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటతో పాటు రెహమాన్ ఈ సినిమా ఆల్బం కోసం స్పెషల్ గా పాలస్థీనా సింగర్ ‘సన మవుసా’ చేత పాటలు పాడించడం విశేషం. కంప్లీట్ రెహమానిక్ స్టైల్ లో కంపోజ్ అయిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ఎసెట్ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

మదర్ సెంటిమెంట్ తో అల్టిమేట్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే హైఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దీఖీ, అక్షయ్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాకి రవి ఉదయ్ వార్ డైరెక్టర్.