‘తిప్పరామీసం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Saturday,October 12,2019 - 02:15 by Z_CLU

శ్రీ విష్ణు ‘తిప్పరామీసం’ నవంబర్ 8 న రిలీజవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. రీసెంట్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ రేజ్ చేసిన టీమ్, ప్రస్తుంతం సినిమాని వైడ్ రేంజ్ లో ప్రమోట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న మేకర్స్, గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

శ్రీవిష్ణు సినిమాలంటే డిఫెరెంట్ గా ఉంటాయన్న ఇమేజ్ ఆడియెన్స్ లో ఉంది. అందుకే ‘తిప్పరా మీసం’ చుట్టూ కూడా ఎక్స్ పెక్టేషన్స్ జెనెరేట్ అవుతున్నాయి. ఈ సినిమాలో నిక్కీ తంబోలి హీరోయిన్ గా నటించింది. కృష్ణ విజయ్ L. దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.