డిఫెరెంట్ కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’

Wednesday,February 06,2019 - 12:33 by Z_CLU

మరో సినిమాతో రెడీ అవుతున్నాడు శ్రీవిష్ణు. ‘తిప్పరా మీసం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజే రిలీజైంది. సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫిక్సయిన మేకర్స్, ఈ పోస్టర్ తో సోషల్ మీడియాలో వైబ్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

ఈ సినిమా స్టోరీలైన్ అయితే ప్రస్తుతానికి రివీల్ కాలేదు కానీ పోస్టర్ లో రివీల్ అవుతున్న శ్రీ విష్ణు లుక్స్ ని బట్టి, ఈ సారి విష్ణు కొత్త క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. దానికి తోడు కళ్ళకు ఉన్న పగిలిన అద్దాలు, సినిమాపై మరింత క్యూరియాసిటీని రేజ్ చేస్తున్నాయి.

శ్రీ విష్ణు సరసన నిక్కీ తంబోలి  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కృష్ణ విజయ్ L. దర్శకుడు. రిజ్వాన్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.