శ్రీ విష్ణు కొత్త సినిమా లాంచ్ అయింది

Friday,December 06,2019 - 02:13 by Z_CLU

శ్రీ విష్ణు కొత్త సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. రీసెంట్ గా ‘తిప్పరా మీసం లో అగ్రెసివ్ గా కనిపించిన శ్రీవిష్ణు ఈసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు.

సినిమాకు సంబంధించి జనవరి నుండి షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్న మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

TG విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల మరియు కీర్తి చౌదరి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హాసిత్ గోలి ఈ సినిమాకి దర్శకుడు.