శ్రీ విష్ణు ఇంటర్వ్యూ

Monday,March 19,2018 - 03:27 by Z_CLU

శ్రీ ‘విష్ణు నీదీ నాదీ ఒకే కథ’ సినిమా ఈ నెల 23 న రిలీజ్ కి రెడీ అవుతుంది. వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా మీడియాతో చాలా విషయాలు చెప్పుకున్నాడు శ్రీ విష్ణు. అవి మీ కోసం….

అదే సినిమా…

ఈ సినిమా ప్రేక్షకుడి కథ స్క్రీన్ పై చూసే వాడి కథ ఒకటే అనిపిస్తుంది. స్టడీస్ కంప్లీట్ అయినప్పటి నుండి సెటిల్ అయ్యేవరకు వరకు హీరో పడే స్ట్రగులే ఈ సినిమా.

సినిమాలో కీ పాయింట్…

ఇంటర్మీడియట్ తరవాత డిగ్రీ చేస్తున్న స్టూడెంట్ ని ఒకలా, ఇంజినీరింగ్ చేస్తున్న స్టూడెంట్ ని మరోలా ట్రీట్ చేస్తుంది సొసైటీ. ఆ తేడా మనకు కూడా తెలుసు. ఏదో ప్రెజర్ మధ్య ఇష్టం లేని చదువు చదివి, చివరికి ఇష్టం లేని జాబ్ చేయడం కన్నా, మనకు నచ్చిన పని చేసి కంప్లీట్ లైఫ్ ని బ్రతమకని చెప్పడం ఈ సినిమాలో కీ పాయింట్. అది సినిమాలో పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవుతుంది.

అవి సినిమాలో ఉండవు…

సినిమా మొత్తం రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి న్యాచురల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మరీ క్లాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, గ్లామర్ అలా ఉండదు సినిమా.

క్యారెక్టర్ ఉంటుంది…

ఈ సినిమాలో నేనేదో హీరోలా కనిపించను. ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. దీని తర్వాత ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలో కూడా క్యారెక్టరే ప్లే చేశాను.  వీటి తరవాత ‘తిప్పరా మీసం’ సినిమా చేస్తున్నాను. దీని తర్వాత పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది.

 

నా రేంజ్ కి తగ్గ సినిమాలు…

నా సినిమాలో మ్యాగ్జిమం మిడిల్ క్లాస్ న్యాచురల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి అలాంటి సినిమాలు తీస్తేనే తక్కువ బడ్జెట్ లో అవుతాయి. నా సినిమా బడ్జెట్ నా రేంజ్ లోనే ఉంటుంది.

డాగ్మీ 95 మేనిఫెస్టో…

జీరో  బడ్జెట్ తో సినిమా చేయడమే డాగ్మీ 95 మేనిఫెస్టో. ‘నీదీ నాదీ ఒకే కథ’ అలా తెరకెక్కిందే…

అంత ఈజీ కాదు…

ప్రస్తుతానికి మంచి క్యారెక్టర్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను తప్ప మాస్ హీరో అనిపించుకోవాలన్న ఆలోచన లేదు. మాస్ హీరో అవ్వడం అంత ఈజీ కాదు… డిఫెరెంట్ సినిమాలు చేయాలి, ప్రయోగాత్మక సినిమాలు చేయాలి.  అదే గోల్…

సినిమా సినిమాకి తెలుస్తుంది…

మన వీక్ నెస్, స్ట్రెంత్ అనేవి మనం సినిమాలు చేస్తున్న కొద్దీ తెలుస్తుంటాయి. మామూలుగా క్యారెక్టర్ చెప్పగానే ఎగ్జైటెడ్ అయిపోయి ఆడియెన్స్ ని కన్విన్స్ చేసేస్తాం అనే కాన్ఫిడెన్స్ తో చేసేస్తాం. ఆ రేంజ్ లో నిజంగా పర్ఫామ్ చేశామా లేదా..? ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనేది ఆ సినిమా రిలీజవ్వగానే తెలిసిపోతుంది.