శ్రీ సింహ కోడూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,December 23,2019 - 02:00 by Z_CLU

కీరవాణి గారి అబ్బాయి.. నిన్నా మొన్నటిదాకా అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఓ వైపు రాజమౌళి రేంజ్ బ్యాక్ గ్రౌండ్.. అందునా మొదటి సినిమా… ఎలా ఫీలవుతున్నాడు సింహ కోడూరి…? ఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ దొరికింది…? వీటికి ‘జీ సినిమాలు’ చేసిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు ఈ డెబ్యూ హీరో.. ఇవి మీకోసం…

కీరవాణి గారి అబ్బాయి…

నాకు ఎక్కడికి వెళ్ళినా కీరవాణి గారి అబ్బాయి అనే రిసీవ్ చేసుకుంటారు. కానీ నాకంటూ ఓ గుర్తింపు ఉండాలన్నది నా తపన. అందుకే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోకుండానే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా…

చిన్నప్పుడు NTR గా…

చిన్నపుడు ‘యమదొంగ’ లో NTR గారి చైల్డ్ హుడ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు కూడా ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. రామ్ చరణ్ గారు కూడా ‘రంగస్థలం’ నుండి పరిచయం. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు.

రాజమౌళి గారు భయపడ్డారు…

యాక్టింగ్ చేస్తా అనగానే సర్వైవ్ అవ్వగలనా.. లేదా.. అనే ఆలోచనతో కొంచెం భయపడ్డారు. కానీ ఎప్పుడూ వద్దు అని ఆపలేదు. ఏది చేసినా కష్టపడి చేయమనే చెప్పారు.

కనీసం ఊహించలేదు…

నటుడినవ్వాలనే నా కల.. సంగీత దర్శకుడవ్వాలనే భైరవ అన్న కల ఒకే సినిమాతో తీరుతుందని కనీసం మేము కలలో కూడా అనుకోలేదు. ఇదంతా అనుకోకుండా జరిగింది.

నేను అవన్నీ ఆలోచించలేదు…

రాజమౌళి గారు.. కీరవాణి గారు…. ఆ ఇంటి నుండి వచ్చాడు అని నా నుండి హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయని ఆలోచించి ప్రెజర్ తీసుకుంటే నేను చేసే పనికి న్యాయం చేయలేను. అందుకే నేను అవన్నీ ఆలోచించలేదు.

ఆ అవకాశం ఉంటుంది…

అల్టిమేట్ గా నేను చేయాలనుకున్నది యాక్టింగే… కాకపోతే ‘రంగస్థలం’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా. అలా చేయడం వల్ల అన్ని క్రాఫ్ట్స్ గురించి అవగాహన వస్తుంది. అందుకే చేశా.

ఆ ఆలోచన అమ్మదే…

యాక్టర్ గా సినిమా చేసే కన్నా ముందే ఏదైనా సినిమాకి పని చేయమన్నది అమ్మనే. ఆ ఆలోచన అమ్మదే.

తేడా తప్పకుండా ఉంటుంది…

నేను అనుకుంటే రాజమౌళి గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయొచ్చు.. కానీ ఎంతైనా ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది. బయటి వాళ్ళతో పని చేయడానికి.. ఇంట్లో వాళ్ళతో పని చేయడానికి చాలా తేడా ఉంటుంది. అందునా సుకుమార్ గారంటే నాకు  చాలా ఇష్టం. అందుకే ఆయన దగ్గర పట్టు పట్టి మరీ జాయిన్ అయ్యా…

సుకుమార్ గారికి చెప్పలేదు…

నేను సుకుమార్ గారి దగ్గర జాయిన్ అయినప్పుడు ఎవరికీ నేను కీరవాణి గారి అబ్బాయిని అని చెప్పలేదు. ముందు సుకుమార్ గారి రైటర్ శ్రీను గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన కొన్ని రోజులు నను అబ్జర్వ్ చేసి సుకుమార్ గారికి పరిచయం చేశారు. ఆయన నేను ఏం చేయగలుగుతానో కనుక్కుని… పంపించేశారు. ఆ తరవాత షెడ్యూల్స్ స్టార్ట్ అయినపుడు పిలిచి.. చూడు అబ్జర్వ్ చెయ్.. నేర్చుకో.. అని చెప్పారు.

నేను నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ…

సుకుమార్ గారు ఏ విషయంలో కూడా ఇదే బెస్ట్ అని ఫిక్స్ అవ్వరు… ఎక్కడ ఇంప్రూవ్ మెంట్ కి చాన్సెస్ ఉంటాయో.. అక్కడ ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు. ఎక్కడా ఆగరు.. అదే ఆయన దగ్గర నేను నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ…

రాజమౌళి గారి కాంప్లిమెంట్…

సినిమా చూశాక రాజమౌళి గారు హ్యాప్పీగా ఫీల్ అయ్యారు. కొన్ని చోట్ల చేంజెస్ సజెస్ట్ చేశారు… సినిమా బావుందని చెప్పారు…