శ్రీరామ్ వేణు ఇంటర్వ్యూ

Wednesday,December 27,2017 - 02:00 by Z_CLU

నాని MCA సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వదిన మరుదుల రిలేషన్ షిప్ ని హైలెట్ చేస్తూ, ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు, ఇటు యూత్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ శ్రీరామ్ వేణు తన హ్యాప్పీనెస్ ని మీడియాతో షేర్ చేసుకుంటూనే, ఈ MCA జర్నీలోని ఇంట్రెస్టింగ్ ఫేజెస్ ని డిస్కస్ చేశారు. ఆ చిట్ చాట్ మీకోసం…

నమ్మిందే చెప్పాను…

మిడిల్ క్లాస్ కాన్సెప్ట్స్ తో ఇంతకు ముందే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో నేను నమ్మింది చెప్పాను. అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.

 

అందుకే ఇంత గ్యాప్ వచ్చింది…

‘ఓ మై ఫ్రెండ్’ సినిమా తరవాత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమా తరవాత ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయిన 2 సినిమాలు ఆగిపోయాయి. ఒక్కో సినిమాకి సంవత్సరం కన్నా ఎక్కువే స్పెండ్ చేశాను. అందుకే ఈ గ్యాప్…

ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది…

దాదాపు 5 ఏళ్ల గ్యాప్… 2 సినిమాలు ఆల్మోస్ట్ సెట్స్ దాకా వెళ్లి ఆగిపోవడం ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రెజర్ పడ్డాను. ఆ టైమ్ లో ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది…

అందుకే శ్రీరామ్ వేణు….

ఒకరోజు ఒక పెద్దాయన మా ఇంటికి వచ్చి పేరడిగినప్పుడు వేణు శ్రీరామ్ అని చెప్తే, ‘శ్రీ’ ఎప్పుడూ ముందుండాలి అని చెప్పారు. అలా వేణు శ్రీరామ్, శ్రీ రామ్ వేణు అయ్యాడు…

 

నా రియల్ స్టోరీ…

‘MCA’ సినిమా నిజానికి వదిన మరుదుల కథ. ఒకరకంగా ఇది నా రియల్ స్టోరీ. నేను, నా తమ్ముడు చాలా క్లోజ్ గా ఉంటాం. కానీ నా పెళ్ళయిన కొత్తలో ఇన్ సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. అది నాకు చాలా క్యూట్ గా అనిపించింది. చేతిలో సినిమా లేక డైరీ తిరగేస్తున్నప్పుడు గుర్తుకు వచ్చి ఆ పాయింట్ నే   డెవెలప్ చేశా…

అందుకే వరంగల్….

ఏదైనా కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలోనే వరంగల్ ని బ్యాక్ డ్రాప్ గా  పెట్టుకున్నాం. హిస్టారికల్ ప్లేస్  అయి ఉండటం, ఎక్కువ సినిమాలు కూడా ఈ బ్యాక్ డ్రాప్ లో లేకపోవడంతో ఈ ఏరియాని పిక్ చేసుకుంటే కొంచెం కొత్తగా  ఉంటుంది అనిపించింది. అందుకే వరంగల్…

భూమిక  ఒప్పుకుంటారని  మేమూ అనుకోలేదు…

వదిన క్యారెక్టర్ కి భూమిక అనుకున్నప్పుడు అనుమానంగానే అప్రోచ్ అయ్యాం. అప్పటి వరకు టాప్ హీరోయిన్ గా ఉన్నావిడ, వదిన రోల్ కి ఒప్పుకుంటారో లేదో అనుకుంటున్నాం. స్టోరీ విన్నాక ఆవిడ 24 గంటలు టైమ్ అడిగారు, ఆ తరవాత యస్ అన్నారు.. అలా జరిగింది.

రాజుగారు వార్నింగ్ ఇచ్చారు…

రాజు గారికి వరసగా 5 హిట్లు ఉన్నాయి… ఇది గనక ఫ్లాప్ అయితే సెకండ్  హ్యాట్రిక్ నా వల్లే మిస్ అవుతుంది. అందుకే రాజు గారు చిన్నగా  వార్నింగ్ కూడా ఇచ్చారు. తేడా  వస్తే  మొత్తం ట్రాక్ రికార్డ్ పోతుందనే   బిగినింగ్ నుండి ఉంది. అందుకే సినిమాలో ప్రతి ఎలిమెంట్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశా…

అప్ డేట్ చేసుకుంటూనే ఉన్నా…

ఐదేళ్ళ గ్యాప్ అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ గ్యాప్ లో రిలీజైన ప్రతి సినిమా చూసేవాణ్ణి. ప్రతి మంచి సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. ఈ ఐదేళ్ళల్లో ట్రెండ్ చాలా మారింది. నేను కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూనే ఉన్నా…