Alluri Teaser పవర్ రోల్ తో శ్రీ విష్ణు

Monday,July 04,2022 - 12:40 by Z_CLU

SreeVishnu’s ‘Alluri’ Teaser Talk

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా నుండి ఫస్ట్ వారెంట్ పేరుతో టీజర్ రిలీజైంది. లక్కీ మీడియా బేనర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నేడు అల్లూరి సీతారామరాజు జయంతి ని పురస్కరించుకొని ఫస్ట్ టీజర్ విడుదల చేశారు.

శ్రీ విష్ణు పోలీస్ గా ఎంట్రీ ఇస్తూ ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్  సినిమాలో ఉండే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ సీన్స్ , పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తాలూకు గ్లిమ్స్ , అల్లూరి పాత్రలో శ్రీ విష్ణు పవర్ ఫుల్ యాక్టింగ్  తో ఆకట్టుకుంది. ముఖ్యంగా నక్సల్స్ దగ్గరికి వెళ్లి శ్రీ విష్ణు ” అల్లూరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ” అంటూ చెప్పే డైలాగ్ ఆ తర్వాత వచ్చే విజువల్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

ఓవరాల్ అల్లూరి కేరెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో చూపిస్తూ ‘అల్లూరి’ టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. శ్రీ విష్ణు ట్రాన్స్ఫర్మేషన్ , ఈ రోల్ కోసం ట్రై చేసిన న్యూ లుక్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.   రాజ్ తోట కెమెరా వర్క్ , హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవ్వనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.  ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు మేకర్స్.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics