నివేద థామస్ , నివేద పేతురాజ్ లతో శ్రీ విష్ణు

Sunday,December 30,2018 - 09:10 by Z_CLU

యంగ్ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండోసారి జతకట్టబోతున్నారు. మెంటల్ మదిలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సారి క్రైమ్ కామెడీతో రాబోతున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నివేదాథామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.