'తిప్పరా మీసం' ... కొత్త లుక్ తో యంగ్ హీరో

Saturday,June 23,2018 - 05:23 by Z_CLU

ఎల్.విజయ్ డైరెక్షన్ లో శ్రీ విష్ణు నటిస్తున్న సినిమా ఇటివలే లాంచ్ అయింది. మొన్నటి వరకూ సాఫ్ట్ లుక్ తో సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో ఈ మూవీ కోసం కంప్లీట్ లుక్ చేంజ్ చేసేసాడు. మునుపెన్నడూ లేని విధంగా మీసం గెడ్డం బాగా పెంచేసి మాసీ లుక్  లోకి మారిపోయాడు. మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘తిప్పరా మీసం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్సపై ‘శ్రీ ఓం సినిమా’ సమర్పణలో ఈ సినిమా  రూపొందనుంది. జులై నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.