శ్రీకారం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,March 15,2021 - 04:03 by Z_CLU

శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ వీకెండ్ గడిచేసరికి ఈ మూవీకి వసూళ్లు తగ్గాయి. ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) ఈ సినిమాకు 8 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

వ్యవసాయం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు వసూళ్లు కాస్త తక్కువగానే వస్తున్నప్పటికీ.. అవి నిలకడగా ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా శ్రీకారం ఇలానే పెర్ఫార్మ్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పడుతుంది.

ఏపీ, నైజాం 4 రోజుల వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 1.98 కోట్లు
సీడెడ్ – రూ. 1.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.05 కోట్లు
ఈస్ట్ – రూ. 0.73 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.92 కోట్లు
నెల్లూరు – రూ. 0.35 కోట్లు
కృష్ణా – రూ. 0.46 కోట్లు