లుంగీ కట్టిన శర్వా.. శ్రీకారం ఫస్ట్ లుక్

Monday,January 27,2020 - 11:29 by Z_CLU

శతమానంభవతి సినిమా తర్వాత మరోసారి పల్లెటూరి కుర్రాడి క్యారెక్టర్ లోకి మారాడు శర్వానంద్. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ శతమానంభవతి సినిమాలో ఎక్కడా లుంగీలో కనిపించలేదు శర్వా. ఈసారి మాత్రం ఈ యంగ్ హీరో లుంగీ కట్టాడు. ఆ లుక్ తోనే శ్రీకారం ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

లుంగీ పైకి కట్టి, భుజంపై తువ్వాలు వేసుకొని, పొలం గట్లు మీద నడుస్తూ అచ్చమైన రైతులా కనిపిస్తున్నాడు శర్వానంద్. ఈ ఒక్క లుక్ తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. బి.కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శర్వా సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకుముందు నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది ప్రియాంక మోహన్.

సినిమాకు క్లాప్ కొట్టిన రోజునే అచ్చతెలుగు శ్రీకారం అనే టైటిల్ ను ప్రకటించినే యూనిట్, ఈరోజు అదే స్టయిల్ ను కొనసాగిస్తూ తెలుగుదనం ఉట్టిపడే లుక్ రిలీజ్ చేశారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది శ్రీకారం సినిమా.