#RajaRajaChora - శ్రీవిష్ణు వచ్చేస్తున్నాడు!

Wednesday,August 11,2021 - 03:43 by Z_CLU

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘రాజ రాజ చొర’ సినిమా నుండి అప్ డేట్ వచ్చింది. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఆగస్ట్ 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసి ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. సినిమాలో శ్రీవిష్ణు క్యారెక్టర్ , కామెడీ సీన్స్ మెయిన్ హైలైట్ కానున్నాయని యూనిట్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

సినిమాలో దొంగగా కనిపించనున్నాడు శ్రీవిష్ణు. హీరో చేసే దొంగతనాల నుండి ఫన్ క్రియేట్ చేసి ఎంటర్టైనింగ్ గా స్క్రిప్ట్ రాసుకున్నాడు హాసిత్. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న హసిత్ గోలి గతంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర వర్క్ చేశాడు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టి డిఫరెంట్ గా ప్రమోట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు టీం.

Sree Vishnu Raja Raja Chora movie

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై TG విశ్వ ప్రసాద్ , అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నారు. మేఘ ఆకాష్ , సునైనా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజర్.

ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కరోన ఎఫెక్ట్ తర్వాత ఆడియన్స్ థియేటర్స్ లో నవ్వించే సినిమాల కోసం చూస్తున్నారు. సో శ్రీ విష్ణు నుండి వస్తున్న ఈ కామెడీ  ఎంటర్టైనర్ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics