శ్రీవిష్ణు హీరోగా రాజరాజ చోర

Saturday,February 29,2020 - 11:57 by Z_CLU

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, శ్రీవిష్ణు హీరోగా ఓ చిత్రం సెట్స్ పై ఉంది. సునయన హీరోయిన్. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే పేరును నిర్ణయించారు. ‘హసిత్ గోలి’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.

బ్రోచేవారెవరులా లాంటి డిఫరెంట్ చిత్రాలకు పనిచేశాడు హసిత్ గోలి. ఇప్పుడు రాజ రాజ చోర సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఏప్రిల్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి మే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషీయన్స్
DOP: వేదరామన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి
సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్
రచన-దర్శకత్వం: హసిత్ గోలి