శ్రీ విష్ణుతో నివేత థామస్ ?

Saturday,June 09,2018 - 04:20 by Z_CLU

శ్రీ విష్ణు హీరోగా ‘మెంటల్ మదిలో’ సినిమాను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ మరోసారి శ్రీ విష్ణుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు యూనిట్… పెర్ఫార్మెన్స్ కి స్కోప్  ఉన్న క్యారెక్టర్ కావడంతో  హీరోయిన్ గా నివేత థామస్ ను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది…

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మన్యం ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కుమార్ నిర్మించనున్నారు. సత్య , నివేత పెతురాజ్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు.