Raja Raja Chora - సెట్స్ పైకొచ్చిన శ్రీవిష్ణు

Thursday,October 08,2020 - 08:16 by Z_CLU

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా రాజ రాజ చోర. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకొచ్చింది. లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమాను తిరిగి స్టార్ట్ చేశారు.

హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న Raja Raja Chora సినిమాలో శ్రీవిష్ము సరసన Megha Akash, Sunayana హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Sree Vishnu Raja Raja Chora zeecinemalu 1

raja raja chora

హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ పాల్గొనగా కొన్ని సీన్లను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హౌజ్ లో షూట్ చేశారు. మూవీ షూట్ కంప్లీట్ అయ్యేంతవరకు కంటిన్యూస్ గా ఈ షెడ్యూల్ సాగుతుంది.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి నటిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.