జూన్ 28న థియేటర్లలోకి `బ్రోచేవారెవ‌రురా`

Tuesday,June 11,2019 - 04:18 by Z_CLU

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో సినిమా ఇది.

`చ‌ల‌న‌మే చిత్ర‌ము… చిత్ర‌మే చ‌ల‌న‌ము` అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. క్రియేటివ్ నెరేష‌న్‌ను, ఆర్టిస్టిక్ అంశాల‌కు జ‌నాలు ఫిదా అవుతున్నారు. స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు.`బ్రోచేవారెవ‌రురా` ట్రైల‌ర్, ఆడియో రిలీజ్ డీటెయిల్స్ ను త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తారు.

న‌టీన‌టులు:
శ్రీ విష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌
సాంకేతిక నిపుణులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌: విజ‌య్ కుమార్ మ‌న్యం
సంస్థ‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
కెమెరా: సాయి శ్రీరామ్‌
ఎడిట‌ర్: రవితేజ గిరిజాల‌