వీరభోగ వసంతరాయలు.. శ్రీవిష్ణు ఫస్ట్ లుక్

Monday,October 22,2018 - 12:00 by Z_CLU

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘ వీర భోగ వసంత రాయలు ‘.. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో శ్రీవిష్ణు షర్ట్ లేకుండా, బాడీ మొత్తం టాటూలతో కనిపిస్తున్నాడు.. సరికొత్త హెయిర్ స్టైల్ తో, షర్ట్ లేకుండా శ్రీవిష్ణు కనిపించడం ఇదే ఫస్ట్ టైం.

ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది టాగ్ లైన్.. ఇప్పటికే సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా ని బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై అప్పారావు బెల్లన నిర్మిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 26 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..

నటీనటులు : నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: ఇంద్రసేన.ఆర్
నిర్మాతలు: అప్పారావ్ బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సమర్పించువారు : డా.ఎమ్.వి.కే రెడ్డి
సంగీతం : మార్క్ కె రాబిన్
డిఓపి : ఎస్. వెంకట్,
ఎడిటర్: శశాంకర్ మాలి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి