మరోసారి మీసం తిప్పుతా

Tuesday,October 29,2019 - 01:53 by Z_CLU

బ్రోచేవారెవరురా సినిమాతో సక్సెస్ కొట్టిన శ్రీవిష్ణు, ఈసారి తిప్పరా మీసం అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి హిట్ కొడతానంటున్నాడు ఈ హీరో. సినిమా హైలెట్స్ తో పాటు తన క్యారెక్టర్ షేడ్స్ ను బయటపెట్టాడు.

“తిప్పరా మీసం టైటిల్ కు తగ్గట్టు ఉండడం కోసం గెటప్ మార్చాను. 7-8 కిలోల బరువు కూడా పెరిగాను. హెవీగా కనిపించడం కోసమే ఇదంతా. సినిమాలో నా గెటప్ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాను ఓ ప్రత్యేకమైన జానర్ కింద చెప్పడానికి వీల్లేదు. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాకు అలా కుదిరింది.”

తిప్పరా మీసం సినిమాలో పాత్ర పోషించడానికి చాలా కష్టపడ్డాడట శ్రీవిష్ణు. చివరికి రియల్ లైఫ్ లో కూడా రఫ్ గా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

“ఇప్పటివరకు నేను చాలా పాత్రలు చేశాను. అన్నీ ఎంజాయ్ చేశాను. కానీ తిప్పరా మీసంలో చేసిన పాత్ర మాత్రం కష్టం అనిపించింది. అగ్రెసివ్ గా కనిపించాలి. అందరితో రఫ్ గా బిహేవ్ చేయాలి. ఇలాంటి పాత్ర ఇంతకుముందు చేయలేదు. బయట కూడా అలా బిహేవ్ చేయలేదు. అందుకే కష్టం అనిపించింది. క్యారెక్టర్ లోకి వెళ్లి తర్వాత కొన్ని రోజులకు బయట కూడా రఫ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. అంత కనెక్ట్ అయ్యాను.”

కృష్ణ విజయ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లలోకి వస్తోంది. నిక్కీ తంబోలి హీరోయిన్ గా నటించింది. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఇచ్చాడు.