'SR కళ్యాణ మండపం' ట్రైలర్ రివ్యూ

Thursday,February 04,2021 - 01:41 by Z_CLU

కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘SR కళ్యాణమండపం’ టీజర్ విడుదలైంది. “ఏన్నో మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా” అంటూ ఓ ఫన్నీ డైలాగ్ తో  కిరణ్  బ్యాక్ సైడ్ షాట్ తో మొదలైన  టీజర్ “మమ్మల్ని గెలకొద్దు మేం బాగుపడతాం” అంటూ కిరణ్ సీరియస్ డైలాగ్ తో ఎండ్ అయ్యింది.  టీజర్ లో హీరో క్యారెక్టర్ , డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ అన్ని ఎలివేట్ అయ్యాయి.

ముఖ్యంగా సీమ యాసలో మాట్లాడుతూ అన్ని ఎమోషన్స్ పండిస్తూ హీరో కిరణ్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవబోతున్నాడనిపిస్తుంది. అలాగే సాయి కుమార్  తన పాత్రతో మంచి కామెడీ పండించబోతున్నాడని అర్థమవుతుంది. ముఖ్యంగా ‘నీ అమ్మ నీ ఒక్క తలకాయ్ నరికితే చాలు ప్రశాతంగా ఉండొచ్చు” అంటూ తన కామెడీ టైమింగ్ తో టీజర్ లో హైలైట్ అయ్యాడు సాయి కుమార్.

ప్రియాంక గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింట్ కానుందని టీజర్ లో షాట్స్ చూస్తే తెలుస్తుంది.  యంగ్ స్టర్స్ కలిసి చేసిన ఈ సినిమాలో కామెడీ , రొమాన్స్ , యాక్షన్ ఇలా అన్నీ ఉన్నాయని చెప్పే విధంగా టీజర్ ని కట్ చేసి వదిలారు. టీజర్ లో చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ , విశ్వాస్ డానియెల్ విజువల్స్, కిరణ్ అబ్బవరం డైలాగ్స్ ఆడియన్స్ ను ఎట్రాక్ చేశాయి. ఓవరాల్ గా  రెండు నిమిషాల ఇరవై సెకన్ల గల ‘SR కళ్యాణ మండపం’ టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా ఉంది.