SR KalyanaMandapam - ఫస్ట్ డే కలెక్షన్

Saturday,August 07,2021 - 06:19 by Z_CLU

రిలీజ్ కు ముందే సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. ఆ తర్వాత విడుదల చేసిన ట్రయిలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో SR KalyanaMandapam సినిమాకు తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 3 కోట్ల 51 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్ ఈ సినిమానే.

sr kalyanamandapam

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకు 2 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇది కరోనా టైమ్. ప్రేక్షకులు థియేటర్లకు రావాలా వద్దా అని డౌట్ పడుతున్న సీజన్. మరోవైపు ఏపీలో టిక్కెట్ రేట్లు భారీగా తగ్గించారు. ఇలాంటి టఫ్ కండిషన్స్ లో కూడా SR కళ్యాణమండపానికి రెండున్నర కోట్ల వసూళ్లు రావడం ట్రేడ్ ను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం. ఇతడికి ఇది రెండో సినిమా మాత్రమే. అయినప్పటికీ నైజాంలో SR కళ్యాణమండపానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఏకంగా కోటి రూపాయల గ్రాస్ అందుకుంది ఈ సినిమా. అటు ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. టిక్కెట్ రేట్లు తగ్గించినప్పటికీ.. ఉత్తరాంధ్రలో ఫస్ట్ డే 35 లక్షలకు పైగా రాబట్టింది. అటు సీడెడ్ లో తొలి రోజే 50 లక్షల మార్క్ అందుకుంది.

సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. గత శుక్రవారంతో పోలిస్తే ఈ ఫ్రైడే ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ వారం రిలీజైన సినిమాల్లో SR కళ్యాణమండపంతో పాటు.. ఇప్పుడుకాక ఇంకెప్పుడు సినిమాకు ఆడియన్స్ తాకిడి ఎక్కువైంది. ఈ వీకెండ్ గడిచేసరికి ఈ రెండు సినిమాలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics