ఆరు దేశాల్లో స్పైడర్ పోస్ట్ ప్రొడక్షన్

Thursday,July 13,2017 - 05:02 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’. ఇటీవలే మేజర్ పార్ట్ షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటీవలే మహేష్ రకుల్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్ మిగిలిన మరో సాంగ్ ని చిత్రీకరించడం కోసం త్వరలోనే యూరోప్ బయలుదేరనుంది. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం షూటింగ్ అయిపోతుంది.

సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కోసం ప్రస్తుతం రష్యా, ఇరాన్, బ్రిటన్ దేశాలతో పాటు మరో మూడు దేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేయిస్తున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు ఇలా ఒకేసారి వివిధ దేశాల్లో సీజీ వర్క్ చేయిస్తున్నారు.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. హరీష్ జైరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆగస్టు లో ఆడియో ను రిలీజ్ చేసి సెప్టెంబర్ 27 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.