స్పైడర్ ట్రయిలర్ లో హైలెట్ ఇదే!

Monday,September 11,2017 - 03:35 by Z_CLU

ఇటు టాలీవుడ్ నుండి బిగిన్ అయితే అటు కోలీవుడ్ వరకు కాన్సంట్రేషన్ మొత్తం స్పైడర్ పైనే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ చేస్తున్నాయి. రీసెంట్ గా ఆడియో రిలీజ్ చేసిన స్పైడర్ సినిమా యూనిట్, ఈ నెల 15 న ఈ సినిమా ట్రేలర్ రిలీజ్ చేయనుంది. అయితే ఈ ట్రేలర్ లో ఎట్రాక్టివ్ యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి.

సెప్టెంబర్ 15 న రిలీజ్ కాబోయే ఈ ట్రేలర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశారు ఫిల్మ్ మేకర్స్.  అల్టిమేట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఒక్కో యాక్షన్ క్లిప్పింగ్ లో సుమారు 2 వేల మంది కనిపిస్తారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హై ఎండ్ ఇంపాక్ట్ చూపించనున్నాయి. .

హాలీవుడ్ స్టాండర్డ్స్ టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో S.J. సూర్య విలన్ గా నటించాడు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.