సోషల్ మీడియాలో స్పైడర్ సునామీ

Thursday,August 10,2017 - 11:42 by Z_CLU

స్పైడర్ టీజర్ కోసం ఆడియన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేశారనే విషయం ఇప్పుడు తెలుస్తోంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ సినిమా టీజర్ వైరల్ అయిపోయింది. ప్రతి గంటకు ఓ రికార్డు సృష్టిస్తూ వస్తోంది. అలా విడుదలైన 24 గంటల్లో 8.6 మిలియన్ వ్యూస్ సాధించింది స్పైడర్ టీజర్. యూట్యూబ్, ఫేస్ బుక్ లో కలుపుకొని టోటల్ ఎమౌంట్ ఇది. ఒక రోజు తిరక్కముందే తెలుగు, తమిళ భాషల్లో స్పైడర్ టీజర్ 80లక్షల 60వేల వ్యూస్ సాధించడం ఓ పెద్ద రికార్డు.

త్వరలోనే స్పైడర్ సినిమాకు సంబంధించి మిగతా పాటల్ని కూడా దశలవారీగా విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో స్పైడర్ థియేట్రికల్ ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇక మిగిలిన ఒక్కపాటను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను సెప్టెంబర్ మొదటివారానికి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు.

మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్ వీ ఆర్ సినిమా బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.