కోటి వ్యూస్ కొల్లగొట్టిన స్పైడర్ టీజర్

Friday,August 11,2017 - 05:21 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇటీవలే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో కోటి వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.


ప్రెజెంట్ ఈ టీజర్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలు పెంచేస్తుంది. షూటింగ్ క్లైమాక్స్ స్టేజి కి చేరుకున్న ఈ సినిమా మరో వైపు ఫాస్ట్ ఫేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 26 న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది..