రొమేనియాలో 'స్పైడర్' సాంగ్ షూటింగ్

Sunday,August 27,2017 - 09:06 by Z_CLU

మహేష్ – మురుగదాస్ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’ ప్రెజెంట్ రొమేనియాలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి సాంగ్ షూటింగ్ ను ఆగస్ట్‌ 25న రొమేనియాలో ప్రారంభించారు యూనిట్… మహేష్-రకుల్ పై చిత్రీకరించనున్న ఈ సాంగ్ ను ఆగస్ట్‌ 31 వరకు షూట్ చేయనున్నారు.


ఈ సాంగ్ తో టోటల్ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్స్ , టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.