మహేష్ “స్పైడర్” పై మరింత క్లారిటీ

Wednesday,May 24,2017 - 01:00 by Z_CLU

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న స్పైడర్ సినిమాపై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. వచ్చే నెలలో ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుందని యూనిట్ ఎనౌన్స్ చేసింది. జూన్ 2వ తేదీనాటికి 2 పాటలు మినహా, స్పైడర్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని క్లారిటీ ఇచ్చింది యూనిట్.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది స్పైడర్ మూవీ. మహేష్-రకుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చుచేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మిస్తున్నారు. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

 

జూన్ లో మిగిలిన 2 పాటల షూటింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటల్ని కంప్లీట్ చేస్తూనే, మరోవైపు కొరటాల శివ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడు మహేష్.