త్వరలో స్పైడర్ సెకండ్ సాంగ్

Tuesday,August 22,2017 - 05:28 by Z_CLU

స్పైడర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా క్రేజ్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడో బిగిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘బూమ్ బూమ్ సాంగ్’ సాంగ్ తో సినిమా స్టామినాని ఎలివేట్ చేసిన స్పైడర్ టీమ్, త్వరలో మరోసాంగ్ రిలీజ్ చేయనుంది.

అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ త్వరలో ‘పుచ్చకాయ పుచ్చకాయ’ అనే సాంగ్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. అరబిక్ ఫ్లేవర్  లో సాగే ఈ సాంగ్ ‘బూమ్ బూమ్’ సాంగ్ రేంజ్ లోనే  ఇంప్రెస్ చేసేస్తుందని  కాన్ఫిడెంట్ గా ఉంది స్పైడర్ టీమ్. అరబిక్  ఫ్లేవర్ లో సాగే  ఈ పాటని బాలీవుడ్ సింగర్ బ్రిజేష్  శాండిల్య  పాడాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 25 నుండి 31 వరకు రొమేనియాలో జరగనుంది. ఈ షెడ్యూల్ తో బ్యాలన్స్  ఉన్న  పాటను  తెరకెక్కించేసి  షూటింగ్ కి ప్యాకప్ చెప్పనుంది స్పైడర్ టీమ్.