దసరా కానుకగా స్పైడర్ రిలీజ్

Monday,May 29,2017 - 10:35 by Z_CLU

మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దసరా కానుకగా సెప్టెంబర్ ఆఖరి వారంలో స్పైడర్ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా ప్రకటించాడు. స్పైడర్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని, దసరా కానుకగా వస్తున్నామని ట్వీట్ చేసిన మహేష్.. ఈనెల 31న ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తున్నామన్నాడు.

ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. తండ్రి ప్రతి బర్త్ డేకు తన సినిమాకు సంబంధించి ఏదో ఒక హంగామా చేయడం మహేష్ కు అలవాటు. అందుకే ఈ పుట్టినరోజుకు స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోంది స్పైడర్ ముూవీ. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.