మహేష్ 'స్పైడర్' పోస్ట్ పోన్...?

Sunday,April 23,2017 - 10:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఏవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న ‘స్పైడర్’ జూన్ నుంచి ఆగస్టు కి పోస్ట్ పోన్ అయ్యిందనే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం చెన్నై లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకోనుంది.. ఈ షెడ్యూల్ తో షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కానుందని సమాచారం..

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని ఈ మధ్యే సోషల్ మీడియా ద్వారా దర్శకుడు మురుగదాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ప్రెజెంట్ ఈ సినిమా జూన్ నుంచి ఆగస్టు కి పోస్ట్ ఫోన్ అయిందని అందుకే అల్లు అర్జున్ ఈ డేట్ ని తన డి.జె కోసం లాక్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది..మరి మహేష్ జూన్ నుంచి ఆగస్టు కి షిఫ్ట్ అయ్యాడనే వార్త లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…