స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Wednesday,April 26,2017 - 04:30 by Z_CLU

స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..? అల్ మోస్ట్ ఫిక్స్ అయినట్టే అనిపిస్తుంది. మే 2 నుండి ఫైనల్ షెడ్యూల్ ని బిగిన్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, మే లాస్ట్ వీక్ కల్లా కంప్లీట్ గా ప్యాకప్ చెప్పే ప్లానింగ్ లో ఉంది. ఇక సినిమాని ఆగష్టు లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

2015 లో రిలీజైన శ్రీమంతుడు ఆగష్టు లోనే 15 న రిలీజయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆగష్టు 9 న మహేష్ బాబు బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోనున్నాడు. వీటికి తోడు ఆగష్టు 15 కి వీకెండ్ కలిసి వస్తుండటంతో, సినిమా యూనిట్ డెఫ్ఫినేట్ గా ఆగష్టు 11 ని కన్సిడర్ చేసే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.  NV ప్రసాద్, ఠాగూర్ మధు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.