గ్రాండ్ గా జరగనున్న స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,September 07,2017 - 03:03 by Z_CLU

స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయింది. సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15 న ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలెబ్రేట్ చేసుకోనుంది. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, అరబ్బీ భాషల్లో విడుదలకానుంది.

హై ఎండ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో S.J. సూర్య విలన్ గా నటించాడు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.