భారీ స్థాయిలో స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్

Tuesday,July 25,2017 - 02:06 by Z_CLU

సెప్టెంబర్ 27 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘స్పైడర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. హై ఎండ్ టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తెలుగుతో పాటు అటు తమిళంలోను భారీ క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ సినిమా తమిళ రైట్స్ ని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రోబో ‘2.0’  సినిమాని నిర్మిస్తున్న ‘LYCA Productions’ దక్కించుకుంది.

మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో S.J. సూర్య విలన్ గా నటించాడు. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్.

రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘స్పైడర్’ పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజర్.