స్పైడర్ సినిమాకి డేట్ ఫిక్సయింది

Tuesday,April 25,2017 - 07:01 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క క్లైమాక్స్ తప్ప. ప్రస్తుతం చిన్న  బ్రేక్ లో ఉన్న సినిమా యూనిట్, క్లైమాక్స్ షూటింగ్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 2 నుండి మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా యూనిట్ మే లాస్ట్ వీక్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసుకునే ఆలోచనలో ఉంది.

పోస్ట్ ప్రొడక్షన్ ని మైండ్ లో పెట్టుకుని ఆల్ రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసిన సినిమా యూనిట్, ఫైనల్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాని N.V. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాతో తమిళనాట కూడా తన చరిష్మా స్ప్రెడ్ చేయనున్న సూపర్ స్టార్, స్పైడర్ లో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.