స్పైడర్ మూవీ అప్డేట్స్

Tuesday,May 02,2017 - 07:40 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్- మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఇటీవలే చెన్నై లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ రేపటి నుంచి హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతుంది..

లేటెస్ట్ గా చెన్నై లో జరిగిన షెడ్యూల్ లో మహేష్-రకుల్-ఎస్.జె.సూర్య – భరత్ లపై కొన్ని కీలక మైన సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ రేపటి నుంచి మే నెలాఖరు వరకూ జరగబోయే షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరించబోతున్నారు…

మహేష్ స్పై ఏజెంట్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ తో హైప్ క్రియేట్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పింది… మహేష్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మే చివరి వారంతో షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాను జులై ఎండింగ్ వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్…