స్పైడర్ షూటింగ్ డీటెయిల్స్

Monday,April 17,2017 - 05:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ ‘స్పైడర్’ ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటుండగా ఏప్రిల్ 20 నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుపుకోనుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో గ్రేట్ రెస్పాన్స్ అందుకుంటూ 2 మిలియన్ వ్యూస్ సాధించి సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది..


మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ఓ మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది.. ఎస్.జె. సూర్య నెగటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరులో జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ 23 నుంచి థియేటర్స్ లో హంగామా చేయబోతుంది.. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ బైలింగ్యువెల్ గా రూపొందుతున్న ఈ సినిమాతో మహేష్-మురుగదాస్ కాంబినేషన్ ఎంతటి గ్రాండ్ హిట్ సాధిస్తుందో..చూడాలి.. ..