సోషల్ మీడియాని రూల్ చేస్తున్న స్పైడర్

Thursday,June 08,2017 - 05:04 by Z_CLU

సౌతిండియాలో జస్ట్ 24 గంటల్లోనే ఎక్కువమంది చూసిన టీజర్ గా ఇప్పటికే రికార్డు సృష్టించింది స్పైడర్ మూవీ. తెలుగుతో పాటు తమిళ్ లో రజనీకాంత్, అజిత్ లాంటి హీరోలు క్రియేట్ చేసిన రికార్డుల్ని క్రాస్ చేసింది. అలా విడుదలైన కొన్ని గంటలకే సంచలనం సృష్టించిన మహేష్ మూవీ, తాజాగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

24 గంటల్లోనే 60లక్షల మందికి పైగా ఈ టీజర్ ను చూశారు. ఆ తర్వాత కొన్ని గంటలనే కోటి వ్యూస్ నమోదు చేసుకుంది. తాజాగా 15 మిలియన్ వ్యూస్ సాధించింది స్పైడర్ టీజర్. ఇది కూడా ఓ రికార్డే. రిలీజైన అతి తక్కువ టైమ్ లోనే కోటిన్నర వ్యూస్ తెచ్చుకున్న టీజర్ గా స్పైడర్ మూవీ రికార్డు సృష్టించింది. దర్శకుడు మురుగదాస్ సృష్టించిన అద్భుతమైన కాన్సెప్ట్ అందరికీ నచ్చడంతో భాషతో సంబంధం లేకుండా టీజర్ క్లిక్ అయింది.

టీజర్ తో అంచనాలు పెరగడంతో అందరి చూపు స్పైడర్ పై పడింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో ఇప్పుడీ సినిమా హాట్ కేక్ గా మారింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నారు. హరీష్ జైరాస్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.