మే 3 నుంచి ఆఖరి షెడ్యూల్

Sunday,April 30,2017 - 06:01 by Z_CLU

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ సినిమా ఓ కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ మే 3 నుంచి
ప్రారంభంకానుంది. హైదరాబాద్ లో ప్రారంభంకానున్న ఈ చివరి షెడ్యూల్ లో మరికొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను పిక్చరైజ్ చేస్తారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది స్పైడర్ మూవీ.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న స్పైడర్ మూవీలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు-నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. హరీష్ జైరాజ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన స్పైడర్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

స్పైడర్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్నాడు మహేష్. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే భరత్ అను నేను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కైరా అద్వాణిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.